ప్రజాశాంతి పార్టీలో చేరిన సినీ నటుడు బాబుమోహన్

Film actor Babu Mohan joined the Praja Shanthi Party

హైదరాబాద్‌ః ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సమక్షంలో సోమవారం ఆయన ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు. ఆయనను పాల్ తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన బాబు మోహన్… చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2014లో టిడిపిని వీడి డిఆర్ఎస్ పార్టీలో చేరి.. ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2018లో బిఆర్ఎస్‌కు రాజీనామా చేసి బిజెపిలో చేరారు. కొన్ని రోజుల క్రితం బిజెపికి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు.