ఈనెల 13 న ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..?

ఏపీ ప్రజలు , రాజకీయ పార్టీల నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. లోక్ సభ తో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తరుణంలో ఈ నెల 13 న ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.

2019లో లోక్సభ ఎన్నికలకు మార్చి 10న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలు ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో షెడ్యూల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.

ఇక ఇప్పటికే బిజెపి లోక్ సభకు సంబదించిన మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించగా..ఏపీలో అధికార – ప్రతిపక్ష పార్టీలు సైతం విడతలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చాక పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.