ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 15 మందికి గాయాలు

Road Accident
Road accident

హైదరాబాద్‌ః ఖ‌మ్మం జిల్లా కూసుమంచిలో శ‌నివారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కూసుమంచి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు బోల్తాప‌డింది. సూర్యాపేట‌-ఖ‌మ్మం జాతీయ ర‌హ‌దారిపై లోక్యాతండా బ్రిడ్జి వద్ద ఈ దుర్ఘ‌ట‌న చోటు చేసుకుంది. బ‌స్సు హైద‌రాబాద్ నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వైపు వెళ్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని వెంట‌నే 108 వాహ‌నంలో చికిత్స కోసం ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. క్ష‌త‌గాత్రుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా, డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా వాహ‌నం న‌డ‌ప‌డం వ‌ల్లే ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు.