వైస్ షర్మిల అరెస్ట్ ..

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ను పోలీసులు అదుపులోకి తీసుకుని , పాదయాత్రకు పోలీసులు అనుమతి రద్దు చేసారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ శంకర్ నాయక్ పైన షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేయటం పైన కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలిస్తున్నట్లు సమాచారం.

మహబూబాబాద్‭లో పాదయాత్ర చేయకుండా ఆమెకు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. షర్మిల పాదయాత్రను ఎలాగైనా అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్‭కు షర్మిల క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి రద్దు చేస్తున్నట్లు ఎస్పీ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఎలాగైనా పాద్రయాత్ర చేసేందుకు మహబూబాబాద్ వెళ్లిన షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.

షర్మిల పాదయాత్ర ప్రస్తుతం మహబూబాబాద్‌ లో కొనసాగుతోంది. అయితే, శంకర్ నాయక్ పైన షర్మిల చేసిన వ్యాఖ్యల పైన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ వేశారు. శంకర్ నాయక్ సైగ చెయ్యి.. ఎవడోస్తాడో చూస్తా అంటూ సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఈ వైఎస్సార్ బిడ్డ అని ధ్వజమెత్తారు.