మధ్యప్రదేశ్ సచివాలయంలోని అగ్నిప్రమాదం

Fire Accident in Madhya Pradesh Secretariat

భోపాల్‌ః మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని భోపాల్‌లోని వల్లభ్ భవన్‌లో శనివారం ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వల్లభ్ భవన్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఉదయాన్నే సచివాలయానికి చేరుకున్న అధికారులు ఫైర్ యాక్సిడెంట్‌ను గుర్తించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైరింజన్లను తీసుకువచ్చి మంటలు ఆర్పివేస్తున్నారు.

శనివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు వల్లభ్ భవన్​లో మంటలు రావడాన్ని కొందరు పారిశుద్ధ్య కార్మికులు గమనించారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.