రైతుల ఆందోళనలు..కరోనా కలకలం

Farmers Protest

న్యూఢిల్లీ: కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సరిహద్దులోనూ వేలాది మంది రైతులు ఒకే ప్రాంతంలో ఉండటంతో, వారిలో కరోనా ప్రమాదం పెరిగింది. ఇప్పటికే సింఘు బార్డర్ లో వందలాది మందికి కరోనా పాజిటివ్ రాగా, తాజాగా, అదే ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసులకూ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ ఉండటం, నిరసనల్లో పాల్గొన్న వారిలో నిత్యమూ వందలాది మంది అస్వస్థతకు గురవుతుండటంతో అధికారుల్లోనూ ఆందోళన పెరుగుతోంది.

ఇదిలావుండగా, తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించి, కొత్త చట్టాలను వెనక్కు తీసుకోకుంటే, రైల్వే ట్రాక్ లను దిగ్బంధం చేస్తామని రైతు సంఘాలనేతలు తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, కేంద్రంతో చర్చలు కొనసాగుతున్న వేళ, తదుపరి దశ నిరసనలను ప్రకటించడం భావ్యం కాదని చెప్పిన గంటల వ్యవధిలోనే రైతు నేతలు ఈ ప్రకటన చేయడం గమనార్హం. తమ ప్రభుత్వం తదుపరి చర్చలకు కూడా సిద్ధంగానే ఉందని, ఏ సమయంలోనైనా రైతులు తమ వద్దకు రావచ్చని ఆయన స్పష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/