30 నుండి తమిళనాడులో పర్యటించనున్న నడ్డా

30 నుండి తమిళనాడులో పర్యటించనున్న నడ్డా
JP nadda

చెన్నై: బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమిళనాడు, పుదుచ్చేరిలలో మూడు రోజులు పర్య టించనున్నారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ తదితర మూడు రాష్ట్రాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మూడు రాష్ట్రాల్లో కార్యకర్తలను ఎన్నికలకు సన్నద్ధం చేసే చర్యలను పార్టీ అధిష్ఠానం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, తమిళనాడు, పుదుచ్చేరిలో ఆయన మూడు రోజులు పర్యటించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/