యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తూనే ఉన్నారు. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి వచ్చేవరకు టెన్షన్ వాతావరణమే. ముఖ్యంగా అతివేగం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

శనివారం ఉత్తరప్రదేశ్ లోని బలరాంపుర్‌ జిల్లాలో ట్రక్కు, కారు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో.. కారులో ఉన్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీ దత్తగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజాజ్ షుగర్ మిల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదంలో ఓ భార్య, భర్త వారి నలుగురు పిల్లలు చనిపోయారు. వీరంతా కారులో దేవ్​రియా నుంచి నైనీతాల్​ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి.. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.