మోడీ సభలో కేసీఆర్ కోసం ప్రత్యేక చైర్ రిజర్వ్..

ఎప్పటిలాగానే ప్రధాని మోడీ పర్యటన కు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అయినప్పటికీ ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కోసం ఒక చైర్ రిజర్వ్ చేసారు. ప్రధాని మోడీ మరికాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని చేయనున్నారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమి పూజ చేయనున్నారు. అలాగే ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా 13 కొత్త సర్వీసులను సైతం ప్రారంభిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో మోడీ పాల్గొననున్నారు. ఇక ఎప్పటిలాగానే మోడీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. అయినప్పటికీ మోడీ సభలో ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ కోసం ఒక చైర్ రిజర్వ్ చేశారు. ప్రధాని మోడీ చైర్ కు ఎడమవైపున కేసీఆర్ కు సీటు కేటాయించారు. ఇదే వేదికపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డికి కూడా చోటు కల్పించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు సీట్లు ఏర్పాట్లు చేశారు. మోడీ సభకు హాజరు అయ్యే ఐదు నిమిషాల లోపు చైర్ లో కూర్చోని ఉండాలి. అలా కాకుండా ఖాళీగా ఉంటే ఈ చైర్ ను తీసిసే సంప్రదాయం ఉంది.