కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..TS కాస్త TG చేస్తాం – రేవంత్ రెడ్డి

If Congress comes to power..TS will do some TG – Revanth Reddy

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ‘TS’ రిజిస్ట్రేషన్ను కాస్త ‘TG’ చేస్తామని, అలాగే ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గీతంగా మారుస్తామని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ నేతలతో సమావేశమైన రేవంత్ అనంతరం మీడియా తో మాట్లాడారు. అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంటర్ అవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 15 రోజుల పాటు 350 కిలోమీటర్ల మేర భారత్ జోడో పాదయాత్ర ఉంటుందన్నారు. మక్తల్ వద్ద రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందన్న ఆయన..అక్కడి నుంచి దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్నగర్, శంషాబాద్, తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు, పటాన్ చెరు, సంగారెడ్డి, జోగిపేట్, పెద్దశంకరంపల్లి, మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతుందని తెలిపారు.

ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. హైదరాబాద్కు స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్సేనని.. సెప్టెంబర్ 17పై టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. తమ పోరాటం ముస్లింలకు వ్యతిరేకంగా కాదని, రాచరికానికి మాత్రమే వ్యతిరేకమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజిస్ట్రేషన్ను ‘TS’ ను ‘TG’ చేయడంతోపాటు ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికారిక గీతంగా మారుస్తామన్నారు. .2023 సెప్టెంబర్ 17లోపు ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.