టొమాటో పులిహోర

రుచి: వెరైటీ వంటకాలు

Tomato Pulihora
Tomato Pulihora

కావలసినవి :
బియ్యం : పావుకిలో, టొమాటోలు: పావుకిలో, చింతపండు గుజ్జు : టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి : ఆరు, ఇంటువ : చిటికెడు, వేరు సెనగ పప్పు : 3 టేబుల్‌ స్పూన్లు, సెనగపప్పు : 2 టేబుల్‌ స్పూన్లు, మినపప్పు : 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు : తగినంత, ఎండుమిర్చి : నాలుగు, ఆవాలు : టీస్పూను,
నూనె : 100 మి.లీ., కరివేపాకు : నాలుగు రెబ్బలు,పసుపు : టీస్పూను.

తయారు చేసే విధానం :

టొమాటాను,. పచ్చిమిర్చి ముక్కలుగా కోసి ఉడికించాలి. చాల్లారాక చింతపండు గుజ్జు చేర్చి మెత్తగా రుబ్బాలి. అన్నం ఉడికించి పక్కన ఉంచాలి.

వెడల్పాటి బాణలిలో ఉడికించిన అన్నంలో టొమా టో గుజ్జు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.

బాణలి లో నూనె పోసి వేరుసనగ పప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు కూడా వేసి వేగాక ఈ తాలింపును టొమాటో గుజ్జు కలిపిన అన్నంలో వేసి కలపాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/