నేడు సీజేఐ యూయూ లలిత్‌కు వీడ్కోలు

cji-justice-uu-lalit-farewell-today-in-supreme-court

న్యూఢిల్లీః నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌కు వీడ్కోలు పలుకనున్నారు. నవంబర్‌ 8న (మంగళవారం) ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నది. అయితే మంగళవారం గురునానక్‌ జయంతి సందర్భంగా కోర్టుకు సెలవు దినం కావడంతో.. సోమవారమే జస్టిస్‌ యూయూ లలిత్‌ చివరి పనిదినం అవుతున్నది. దీంతో సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తికి నేడు వీడ్కోలు పలుకనున్నారు. ఈ నేపథ్యంలో తన చివరి విచారణను లైవ్‌స్ట్రీమింగ్‌ చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్‌క్యాస్ట్‌ చానల్‌తోపాటు యూట్యూబ్‌ చానల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్‌ టెలికాస్ట్‌ ప్రారంభం కానున్నది.

దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ యూయూ లలిత్‌ ఆగస్టు నెలలో బాధ్యతలు స్వీకరించారు. నవంబర్‌ 8న ఆయన పదవీకాలం ముగియనుంది. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సీజేఐకి నేడు సుప్రీంకోర్టు వీడ్కోలు పలుకనున్నది. కాగా, సుప్రీంకోర్టు తదుపతి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్‌ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరిస్తారు. 2024, నవంబర్‌ 10 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/