హాయిగా నిద్రపోతే నొప్పి మాయం

ఆరోగ్య భాగ్యం

SLEEPING
SLEEPING

తలనొప్పిగా ఉంది అంటే కాసేపు కళ్లు మూసుకుని పడుకో కాస్తనిద్రపడితే నొప్పి తగ్గుతుంది అనడం వింటుంటాం.

అంతేకాదు, చిరాకుగా ఉన్నా మనసులో బాధగా ఉన్నా నిద్రపడితే ఆ బాధ ఉండదు సరికదా, లేచాక కూడా మనసంతా తేలికగా అనిపిస్తుంది.

అందుకే కునుకు పడితే తేలికగా పిస్తుంది. అందుకే కునుకు పడితే మనసు కాస్త కుదుటపడతది అంటారు పెద్దవాళ్లు.

వాళ్లు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా అది నూటికి నూరుశాతం నిజమే అంటున్నారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు.

నిద్రలేమి ఏది నొప్పిని మరింత పెంచుతుందని వాళ్ల పరిశీలనల్లో తేలిందట

. ఇందుకోసం పని గట్టుకుని కొందరికి నొప్పిని కలిగించి వాళ్లు పడుకున్నాక ఎమ్మారై స్కాన్‌ చేశారట. అలాగే నొప్పి కలిగించాక కొందరిని నిద్రపోనివ్వకుండా చేశారట.

తరువాత నిద్రపోయిన వాళ్లకీ, నిద్రపోనివాళ్లకీ మెదడు స్కానింగుల్ని తీసి పరిశీలించిన చూడగా నిద్రపోయిన వాళ్లలో నొప్పిని తగ్గించే డోపమైన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర విడుదలై, అనస్తీషియాలా పనిచేసిందట

. అదే నిద్రపోనివాళ్లలో నొప్పిన తగ్గించే హార్మోన్‌ విడుదల కేంద్రాలు మూసుకుపోవడంతో నొప్పి మరింత పెరిగినట్లు గుర్తించారు

. సో, నిద్ర అనేది సహజ మత్తు మందు అని అది ఎలాంటి బాధనైనా నొప్పి నైనా మాయం చేస్తుందనీ అనేది అందుకే మరి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/