కలువ కళ్లకు కొన్ని జాగ్రత్తలు

Beautiful eye care precautions
Beautiful eye care precautions

చదువు, ఉద్యోగరీత్యా గంటలు గంటలు.. ప్రయాణాలు చేసే అమ్మాయిల సంఖ్య ఎక్కువే.. దీనికి తోడు కంప్యూటర్ మీద ఎక్కువ సమయం పనిచేసే సంస్కృతి పెరిగింది.. ఇలాటివారు కళ్లపై కాస్త ఎక్కువ శ్రధ్ధ చూపించాలి.. రోజులో కనీసం నాలుగైదు సార్లు అయినా కళ్ళను చన్నీటితో కడగాలి.. స్మార్ట్ తెరలు చూస్తూ గడిపేవారు, కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి.. మార్కెట్లో ఐ మాస్క్ లు దొరుకు తున్నాయి.. వీటిని ధరిస్తే , కంటి అలసట తగ్గి, చూడటానికి తాజాగా కనిపిస్తాయి. రోజూ ఎన్ని గంటల సమయం నిద్రపోతున్నామనేదే కంటి ఆరోగ్యం పై ప్రభావం చూపించే విషయమే అని మర్చి పోవద్దు . ఎందుకంటే , నిద్రలేమి వల్లనే కళ్ల కింద నలుపు , వలయాలు, గీతాలు ఒకటేమిటి వృద్దాప్య ఛాయల్ని గుర్తు తెచ్చే సూచికలెన్నో వచ్చేస్తాయి. అందుకే, ఏడెనిమిది గంటలు గాఢ నిద్ర పోయేలా చూసుకోండి. అపుడు మీ నయనాలే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.
కొందరు పండుగలూ, పార్టీ లకు తరచూ కళ్లకు అలంకరణ చేసుకుంటారు… మరికొందరు వృత్తి రీత్యా ఆ పని చేస్తుంటారు. ఇలా ఎక్కువ సమయం కంటి మేకప్ వేసుకుని ఉండాల్సి వచ్చినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా ఇందుకోసం వాడే ఉత్పత్తులు నాణ్యమైనవై ఉండాలి. లేదంటే , ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది . అలాగే, నిద్రపోయే ముందు తప్పనిసరిగా తొలగించాలి