ప్రజలు జాగ్రత్త : మరో ఐదు రోజుల పాటు తెలంగాణాలో విపరీతమైన ఎండలు

మరో ఐదు రోజులపాటు తెలంగాణ లో విపరీతమైన ఎండలు ఉన్నాయని..ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. ఉదయం ఏడు గంటల నుండి విపరీతమైన ఎండ, ఉక్కబోత తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావడం లేదు.

ఈ క్రమంలో ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జనగాం, వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.