ప్రశ్నోత్తరాలు లేకుండా పార్లమెంట్‌ సమావేశాలు

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాలు ఈనెల 14వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో వర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యాన్ని ఎత్తివేస్తున్న‌ట్లు తాజాగా రాజ్య‌స‌భ సెక్ర‌టేరియేట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను ఎత్తివేయ‌డాన్ని విప‌క్ష ఎంపీలు త‌ప్పుప‌డుతున్నారు. వాస్త‌వానికి కోవిడ్ నేప‌థ్యంలో లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను వేరు వేరు స‌మ‌యాల్లో నిర్వ‌హించ‌నున్నారు. సోష‌ల్ డిస్టాన్సింగ్ పాటించే ఉద్దేశంతో ఈ చ‌ర్య తీసుకున్నారు. ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు తొలి రోజు లోక్‌స‌భ‌ను నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత మ‌ధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వ‌ర‌కు మిగితా రోజుల్లో లోక్‌స‌భ‌ను నిర్వ‌హిస్తారు. ఇక మ‌ధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వ‌ర‌కు తొలి రోజు రాజ్య‌స‌భ స‌మావేశం అవుతుంది. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌మావేశాలు జ‌రుగుతాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/