దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా సెకండ్ వేవ్

ఢిల్లీలో 30వ తేదీ వరకు వరకు రాత్రి కర్ఫ్యూ

expanding corona second wave in the country
expanding corona second wave in the country

New Delhi: భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది . వేలాది సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారితో మహారాష్ట్ర లో కలకలం మొదలైంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్యం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. వారాంతంలో లాక్ డౌన్ అమలు చేయనున్నారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో కరోనా కేసులు పెరగటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్​ 30 వ తేదీ వరకు వరకు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించింది. తక్షణమే ఉత్తర్వులు అమలులోకి వస్తున్నట్లు పేర్కొంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు ఆంక్షలు విధించింది. ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంవుతుందని స్పష్టం చేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/