సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియామకం

ఈనెల 24న బాధ్యతల స్వీకారం

Justice NV Ramana appointed as Chief Justice of the Supreme Court
Justice NV Ramana appointed as Chief Justice of the Supreme Court

New Delhi: భార‌త సుప్రీంకోర్టు 48వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియామకం అయ్యారు. నూత‌న సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణను రాష్ట్రపతి నియ‌మించారు. ఈ నెల 24వ తేదీన ఎన్వీ ర‌మ‌ణ సీజేఐగా బాధ్య‌త‌లు చేపట్టనున్నారు. ప్ర‌స్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఈ నెల 23న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నుండ‌టంతో ఆయ‌న స్థానంలో నూత‌న సీజేఐగా ఎన్వీ ర‌మ‌ణ‌ నియామకం అయ్యారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 26 వ‌ర‌కు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. బోబ్డే త‌ర్వాత ఎన్వీ ర‌మ‌ణ‌నే సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉండ‌టంతో ఆయ‌న త‌దుప‌రి సీజేఐగా అవ‌కాశం లభించింది.

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌న్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 2017 ఫిబ్ర‌వ‌రి 14 నుంచి సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/