రేపు అర్ధరాత్రి నుంచి ఏపి విద్యుత్ ఉద్యోగుల సమ్మె

ap-electricity-workers-will-go-on-strike-from-tomorrow

అమరావతిః రేపు అర్ధరాత్రి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులు రేపటి నుంచి సమ్మెకు దిగనున్నారు. రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. ముందు జాగ్రత్తగా విద్యుత్ సౌధ వద్ద 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అయితే విద్యుత్ సౌధ ముట్టడిని జేఏసీ వాయిదా వేసుకుంది.