సన్న బియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ కి రావడం విడ్డూరం – అయ్యన్న పాత్రుడు

ఏపీ రాజకీయాలు మరోసారి మరింత వేడెక్కాయి. ఇటీవల విడుదలైన టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువ కావడం ఫై టీడీపీ ప్రభుత్వం ఫై ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం జూమ్ వీడియోలో టెన్త్ ఫెయిల్ అయినా విద్యార్థులతో అలాగే తల్లిదండ్రులతో మాట్లాడి దైర్యం నింపే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ తో పాటు మరొక నేత దేవేందర్ రెడ్డి లు జూమ్ వీడియో లో వచ్చి షాక్ ఇచ్చారు.

వైసీపీ నేతలు ఒక్కసారిగా కనిపించడం తో నిర్వాహకులు వారి కాల్ ను కట్ చేసారు. వీరి రాకపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లోకేష్ , అచ్చెన్న లు దీనిపై స్పందించగా..తాజాగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న ..కొడాలి నాని ఫై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా కొడాలినానిని తీవ్ర పదజాలంతో దూషించారు. గతంలో పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సన్నబియ్యం ఇచ్చే విషయంలో కొడాలి వైఫల్యాన్ని కూడా అయ్యన్న ఇందులో గుర్తుచేశారు.

“8 క్లాస్ ఫెయిల్ అయిన సన్న బియ్యం సన్నాసి 10 క్లాస్ జూమ్ కి రావడం విడ్డూరం. గడప గడప కి వెళ్తుంటే ప్రజలు చెప్పుతో కొడుతున్నారు అందుకే ఆ కార్యక్రమం వదిలేసి జూమ్ కి వచ్చారు. విద్యా వ్యవస్థ ను నాశనం చేసిన జగన్ రెడ్డి రోడ్ల మీదకి వెళ్తే జనం పరిగెత్తించి కొడతారు అనే భయంతోనే పరదాలు కట్టుకొని వెళ్తున్నాడు”. అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

మరోపక్క జూమ్ వీడియో లోకి రావడం ఫై కొడాలి నాని , వంశీ క్లారిటీ ఇచ్చారు. రెండేళ్లుగా క్లాసులు జరగలేదని..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్దులకు ట్యాబ్ లు..స్మార్టు ఫోన్లు లేవని..వారికి ఎనిమిది -తొమ్మది తరగతుల పాఠ్యాంశాల పైన పట్టు లేక పదో తరగతిలో ఫెయిల్ అయ్యారని చెప్పుకొచ్చారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధులకు మరింత బాధ పెట్టేలా వాళ్లను మీటింగ్ లో కూర్చొబెట్టి.. ప్రసంగాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. ఫెయిల్ అయిన విద్యార్దులకు మనోధైర్యం చెప్పాల్సిన సమయంలో..రాజకీయం కోసం వారిని వాడుకోవటం ఏంటని ప్రశ్నించేందుకు తాము జూమ్ మీటింగ్ లోకి వెళ్లామంటూ ఇద్దరు నేతలు చెప్పుకొచ్చారు. పదో తరగతిలో స్టాండర్డ్స్ లేకుండా పాస్ చేస్తే ఆ విద్యార్ధులంతా ఇంటర్ లో ఇబ్బంది పడతారని..వారు పవన్ కళ్యాణ్ – లోకేష్ లా అవుతారరంటూ కొడాలి నాని ఎద్దేవా చేసారు. విద్యార్ధులకు నెల రోజుల్లో తిరిగి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని..అందులో పాస్ అయితే ఇప్పుడు రెగ్యులర్ గా పాసయిన వారితో పాటుగానే వారికి కంపార్ట్ మెంటల్ గా కాకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తారని వివరించారు.