కాంగ్రెస్‌లో చేరిన టిడిపి నాయకురాలు దివ్యవాణి

Ex-TDP leader and actor Divyavani joins Congress

హైదరాబాద్‌ః టిడిపి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ నాయకురాలు దివ్యవాణి… ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే సమక్షంలో దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే దివ్యవాణికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మాణిక్ రావు థాక్రే.

దివ్యవాణి తో పాటు ఆమె అనుచరులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దివ్యవాణి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతానని… తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచిస్తుందని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పదవి ఇచ్చిన… ఇవ్వకపోయినా పార్టీ కోసం మాత్రం కష్టపడతానని స్పష్టం చేశారు. కాగా దివ్యవాణి గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేసిన సంగతి తెలిసిందే.