మెట్రోలో యువతిపై లైగింక వేధింపులు

ప్రభుత్వాలు , కోర్ట్ లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధులు , ఆకతాయిల తీరు మారడం లేదు. ఒంటరి మహిళా కనిపించిన , అభంశుభం తెలియని చిన్నారి ఎదురుపడ్డ వారిలో కామాన్ని బయటకు తీసి అత్యాచారాలు చేయడం ..వేధించడం చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బెంగుళూర్ మెట్రో లో యువతిపై లైంగిక వేదింపులు జరిగిన ఘటన బయటకు వచ్చింది.

సోమవారం ఉదయం 8.50 గంటల ప్రాంతంలో మెజెస్టిక్‌లో మెట్రోలో భారీగా జనం ఎక్కడంతో తోపులాటలు జరిగాయి. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు బాధ్యత వహించే మహిళ.. పెద్ద సంఖ్యలో ప్రజలను రైలు లోపలికి అనుమతించడం తో రైలు అంత జనాలతో కిక్కిరిపోయింది. ఈ సమయంలో ఓ యువతీ ఫై ఓ వ్యక్తి అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. మొదటగా అనుకోకుండా జరిగి ఉంటుందేమో అని సదరు యువతీ భావించింది. కానీ ఆ తర్వాత కూడా అదే పనిగా సదరు వ్యక్తి తాకడం , గోర్లతో రక్కడం చేయడంతో ఒక్కసారిగా ఆ యువతీ పెద్ద అరుస్తూ..అతడిని పట్టుకొనే ప్రయత్నం చేసింది. దీంతో అతడు అక్కడి నుండి పరారయ్యాడు. ప్రస్తుతం సదరు యువతీ పోలీసులకు పిర్యాదు చేసింది.