రేవంత్ ను మీము కంట్రోల్ చేయలేకపోతున్నాం..మీరే కంట్రోల్ చెయ్యండి అంటూ సోనియాకు తెరాస లేఖ

టీపీసీసీ ప‌గ్గాలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డి తన దూకుడు పెంచాడు. మొదటి నుండి కూడా రేవంత్ ది దూకుడు స్వభావమనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేస్తారు. తెరాస పార్టీ ఫై ..కేసీఆర్ ఫై నిత్యం విమర్శలు చేసే రేవంత్..టీపీసీసీ వచ్చినదగ్గరి నుండి ఏమాత్రం కంట్రోల్ లో ఉండడం లేదు. రోజు రోజుకు ఈయన మాటలు తూటాలకంటే పవర్ ఫుల్ ఉండడం తో తెరాస తట్టుకోలేకపోతుంది. తెరాస నేతలు ఒకటి అంటే వంద అనేస్తున్న రేవంత్ ను కంట్రోల్ చేయలేక…కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెరాస లేఖ రాసినట్లు జీవన్ రెడ్డి తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాలేద‌ని గ్ర‌హించే రేవంత్‌రెడ్డి ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని జీవన్ రెడ్డి విమ‌ర్శించారు. రేవంత్‌రెడ్డిది మాటలు.. మూటలు.. ముఠాలు చేసే వైఖరని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన ప్రయోగిస్తున్న పరుష పదజాలంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌ గాంధీలకు లేఖలు రాసినట్లు ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ లేఖల తర్వాతైనా రేవంత్‌ పద్ధతి మార్చుకోవాలని.. థర్డ్‌ క్లాస్‌ మాటలు మానుకోవాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు.