వైసీపీ లో చేరిన టిడిపి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా

ఎన్నికల వేళ అధికార పార్టీ వైసీపీ తో పాటు టీడీపీ , జనసేన పార్టీలకు వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. టికెట్ రాని నేతలంతా పార్టీలు మారుతూ వస్తున్నారు. తాజాగా టీడీపీకి షాక్ ఇస్తూ అధికార పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా. కదిరి టికెట్ ఆశించిన అత్తార్ చాంద్ బాషా..టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురై..పార్టీని వీడారు.

టీడీపీలో ఉంటే రాజీకయ భవిష్యత్తు ఉండదని భావించిన ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. ఆ వెంటనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా కదిరి వచ్చిన సీఎం జగన్‌ను కలిసి వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి చాంద్ బాషాను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు.