జగన్‌పై నేను చేసిన పోరాటాలే నాకు శాపంగా మారాయి – రఘురామ

వైసీపీ రెబెల్ ఎంపీగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామ కృష్ణం రాజు..తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. కూటమి తనకి టికెట్ ఇస్తుందని ఎంతో ఆశపడగా..చివరకు ఆ ఆశ నిరాశే అయ్యింది. రఘురామ కు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వలేదు. ఈ తరుణంలో తన ఆవేదనను వ్యక్తం చేసారు. చంద్రబాబులాంటి గొప్ప వ్యక్తి సీఎం కావాలని నేను పోరాటాలు చేశానని.. అంతే కానీ పదవులు కోసం తాను ఏనాడు ఆరాటపడింది లేదని రఘురామ చెప్పారు. ఇటీవల టీడీపీ. బీజేపీల్లో చేరిన నాయకులు ఎవరూ కూడా ఏనాడు కనిపించింది లేదని..జగన్ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం చూడలేదని.. వారు ఎక్కడైనా జగన్ గురించి మాట్లాడింది చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు.

తనకు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదని తెలిపారు. నాకు రాజకీయ పార్టీల అండ లేదని..అది ఈపాటికే మీకు అర్థం అయి ఉంటుందని రఘురామ చెప్పుకొచ్చారు. నేను ఏ పార్టీలో సభ్యుడును కాను కాబట్టి నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. జగన్‌పై నేను చేసిన పోరాటాలే నాకు శాపంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎటువంటి లాపేక్ష లేకుండా చంద్రబాబు సీఎం కావాలని కోరుకున్నానని.. కానీ నాకే ఎటువంటి న్యాయం జరగలేదంటూ రఘురామ వాపోయారు. ప్రస్తుతం రఘురామ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తుంది.