మూడో రౌండ్ లో కూడా బీజేపీ జోరు

మూడో రౌండ్ లో ఈటలకు 911 ఓట్ల లీడ్
1,269 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్న ఈటల

హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాల ప్రారంభ ట్రెండ్స్ బీజీపీకి అనకూలంగా వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ పై బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పైచేయి సాధిస్తున్నారు. తొలి రెండు రౌండ్లలో లీడ్ సాధించిన ఈటల రాజేందర్ మూడో రౌండ్ లో సైతం ఆధిక్యతను సాధించారు. మూడో రౌండ్ లో ఈటలకు 911 ఓట్ల లీడ్ ఈటల సాధించారు. ఈ మూడు రౌండ్లలో కలిపి ఈటలకు 1,269 ఓట్ల మెజార్టీలో ఈటల కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ కు బలమైన పట్టు ఉన్న హుజూరాబాద్ మున్సిపాలిటీ ప్రాంతంలో కూడా బీజేపీ టీడ్ సాధించడం టీఆర్ఎస్ శ్రేణులను షాక్ కు గురి చేస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/