రెండో రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర

అమరావతి: రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర రెండో రోజుకు చేరింది. తాడికొండ రైతులు, మహిళలు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మంగళవారం తాడికొండ నుంచి గుంటూరులోని అమరావతి రోడ్డు వరకు 13 కిలోమీటర్ల మేర పాదయత్ర చేయనున్నారు. గుంటూరులోని గోరంట్లలో నేటి మహాపాదయాత్ర ముగియనుంది.

కాగా, 45 రోజుల పాటు మహాపాదయాత్ర కొనసాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం రైతులు పోరాటం చేస్తున్నారు. తొలి రోజు 14.5 కిలోమీటర్ల మేర రైతులు పాదయాత్ర చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/