దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ ఈటెల ఆధిక్యం

దేశ వ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల ఫై ఆసక్తి నెలకొని ఉంది. అక్టోబర్ 30న పోలింగ్ జరగ్గా.. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. కోవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగడంతో రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్లలో తెరాస ఆధిక్యం కనపరచగా..ఆ తర్వాత మాత్రం బిజెపి ఆధిక్యం కనపరుస్తూ వస్తుంది.

ఇప్పటి వరకు మూడు రౌండ్ల ఫలితాలు రాగా ..అందులో ఈటెల హావ కనపరిచాడు. ఇప్పటిదాకా వెలువడిన ఫలితాల్లో బీజేపీ 13,525.. టీఆర్‌ఎస్‌ 12,252.. కాంగ్రెస్‌ 446 ఓట్లు సాధించాయి. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బిజెపి ఆధిక్యం కనపరచడం ఈటెల ఫై ప్రజల్లో ఎంత నమ్మకం ఉందొ అర్ధమవుతుంది. మరోసారి ప్రజలు ఈటెల కే పట్టం కట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. శాలపల్లిలోనూ బీజేపీ 129 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఈ గ్రామంలో బీజేపీకి 311 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 182 ఓట్లు వచ్చాయి.