మంటగలిసిన మానవత్వం
కరోనాతో బతికి ఉండగానే మృతిచెందిందని వృద్ధురాలిని గెంటేశారు

- తీసుకెళ్ళండి అంటూ కుటుంబ సభ్యులు కబురు
- కౌన్సిలర్ సాయంతో అపార్ట్ మెంట్ కు వచ్చిన స్వచ్ఛంద సేవకులు
- కొనఊపిరితో ఉన్న వృద్ధురాలు
- ట్రాక్టర్ పై ఆసుపత్రికి తరలింపు
కృష్ణా జిల్లా తిరువూరులో దారుణ ఘటన ఇది. చీరాల సెంటర్ లోని అపార్ట్ మెంట్ లో వృద్ధురాలు కరోనాతో మృతి చెందిందని, ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లమని కుటుంబసభ్యులు కోరారు. కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాకపోవడంతో స్దానిక కౌన్సిలర్ పరసా సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సభ్యులకు సమాచారం ఇచ్చారు. . అయితే, వృద్ధురాలు కొన ఊపితో ఉన్నట్లు గుర్తించారు. అయినప్పటికీ ఆమె దగ్గరకు వెళ్లడానికి కుటుంబ సభ్యులు మందుకు రాలేదు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/