బేబీ బంప్‌తో ఉపాసన

బేబీ బంప్‌తో ఉపాసన కనిపించి పలు అనుమానాలకు తెరదించింది. రీసెంట్ గా మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతుందనే విషయం మెగా అభిమానులను సంతోషానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుండి అంత ఆమెను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అతృతతో ఉన్నారు. ఇదే క్రమంలో కొంతమంది ఉపాసన సరోగసి ద్వారానే ఉపాస‌న బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుందంటూ ఓ వార్త కాస్త కలవరపాటుకు గురిచేసింది. అయితే ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని తేలిపోయింది.

తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా పేజీ లో బేబి బంప్‌తో ఉన్న ఫొటోల‌ను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఉపాస‌న‌కు కాస్త బేబి బంప్ క‌నిపిస్తుంది. కొంత మంది స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న కొణిదెల క‌లిసి దిగిన ఫొటోలు అవి. వాటిని షేర్ చేయ‌టంతో స‌రోగ‌సీ ద్వారానే ఉపాస‌న పిల్ల‌ల్ని క‌న‌బోతుందంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది. ఇక రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న 2012 జూన్ 14న కుటుంబ స‌భ్యులు, బంధు మిత్రుల స‌మ‌క్షంలో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే.