ఈటెల మళ్లీ బిఆర్ఎస్ లో చేరబోతున్నారా..?

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు డిసైడ్ అయ్యాడా..? ప్రస్తుతం రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తుంది. భూక్రమాల ఆరోపణల నేపథ్యంలో ఈటెల బిఆర్ఎస్ వీడి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. బిజెపి చేరిన ఈటెల కు అధిష్టానం మంచి గుర్తింపు ఇచ్చారు. అంత బాగానే ఉంది..నేతలు సైతం పెద్ద ఎత్తున బిజెపి లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అనుకున్నారు. కానీ ఇంతలోనే కర్ణాటక ఎన్నికలు రావడం ..ఆ ఎన్నికల్లో బిజెపి ఓటమి చెందడం తో తెలంగాణ లో చేరికలు బ్రేక్ పడింది. ఇదే క్రమంలో బండి సంజయ్ ని అధ్యక్షా పదవి నుండి తప్పించి , కిషన్ రెడ్డి కి ఇవ్వడం చాలామందికి నచ్చలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైములో అధ్యక్షుడిని మార్చడం ఫై కార్యకర్తలు నిరాశకు గురై అయ్యారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ హావ పెరుగుతుండడం తో ఈటెల మళ్లీ ఆలోచనలో పడినట్లు చెపుతున్నారు. రీసెంట్ గా గురువారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఈటల, మంత్రి కేటీఆర్ .. ఆత్మీయ ఆలింగనం చేసుకొని.. మాట్లాడుకున్నారు. తాజాగా శుక్రవారం ఈటల.. కేటీఆర్ ఛాంబర్‌కి వెళ్లారు. ఆ సమయంలో కేటీఆర్ అక్కడ లేరు. శాసన మండలికి వెళ్లారని సిబ్బంది చెప్పడంతో.. మళ్లీ వస్తానని ఈటల వెళ్లిపోయారు. ఒక రోజు గ్యాప్‌లోనే ఈటల.. మంత్రి కేటీఆర్‌ని కలిసేందుకు ఎందుకు ఆసక్తి చూపించారు అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈటల తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారనీ.. ఎంత త్వరగా వీలైతే.. అంత వేగంగా వెళ్లిపోవాలని వ్యూహాలు రచిస్తున్నారనే టాక్ నడుస్తుంది. తీరా ఎన్నికల సమయంలో పార్టీ మారితే బాగోదని..ఇప్పుడే పార్టీ మారితే బాగుంటుందనే ఆలోచన ఈటెల చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఈటెల ఎలా స్పందిస్తారో చూడాలి.