రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ తగ్గలేదు – బండి సంజయ్

తెలంగాణ లో బిజెపి గ్రాఫ్ తగ్గలేదని , నేతల మధ్య కానీ , పార్టీ లో గానీ ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసారు బండి సంజయ్. అధ్యక్ష పదవి నుండి తొలగించిన తర్వాత బండి సంజయ్..తాజాగా ప్రధాని మోడీ , అమిత్ షా లతో పాటు జేపీ నడ్డా లను కలిసి..నిన్న హైదరాబాద్ కు వచ్చారు. ఈ క్రమంలో మీడియా తో మాట్లాడుతూ..రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ తగ్గిందనే ప్రచారాన్ని ఖండిస్తున్నా..పార్టీ లో బిజెపి గ్రాఫ్ ఏమాత్రం తగ్గలేదని చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని అన్నారు.

జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించాక తొలిసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుండి ఇక్కడి వరకు వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చి స్వాగతం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. దారి పొడవునా ట్రాఫిక్ ఏర్పడి ప్రజలకు కొంత ఇబ్బందికి గురయ్యారు. క్షమించాల్సిన వారిని కోరుతున్నానని అన్నారు.

సామాన్య కార్యకర్తగా ఉన్న నాకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా అవకాశమిచ్చారు. నాపై విశ్వాసముంచి ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పెద్ద బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి హృదయా పూర్వక ధన్యవాదాలు చెబుతున్నా. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా, సైనికుడిలా పార్టీ కోసం పనిచేస్తానని ప్రకటించారు బండి సంజయ్‌.