బీజేపీలోకి దాసోజు శ్రవణ్ – ఈటెల రాజేందర్

ఇప్పటికే బీజేపీలోకి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ చేరబోతున్నట్లు ప్రకటించగా..తాజాగా దాసోజు శ్రవణ్ సైతం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలోనే దాసోజు శ్రవణ్ బిజెపి లో చేరబోతున్నారని..శ్రవణ్ తో పాటు పలువురు నాయకులు బీజేపీలో చేరబోతున్నట్లు ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలతో ఇంకెవరెవరు వెళ్తారా అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. సిద్దిపేట మురళీయాదవ్, రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావులు బిజెపి లో చేరబోతున్నట్లు చెప్పుకొచ్చిన రాజేందర్.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతోందని.. త్వరలోనే టీఆర్ఎస్ కూడా ఖాళీ అవుతుందని ఎద్దేవా చేసారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఇనుప కంచె వేశాడని .. పెన్షన్ కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రులు ఉన్నారన్నారు. హుజురాబాద్లో ఓ టీఆర్ఎస్ నాయకుడు చిల్లర వేషాలు వేస్తున్నాడని.. ప్రజలే అతడికి తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.

ఇటీవల బాసర ట్రిపుల్‌ ఐటీలో చోటు చేసుకున్న ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క ట్రిపుల్ ఐటి లోనే కాదు… అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ల్లో అదే రకమైన పరిస్థితి నెలకొందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాసర వెళ్తున్నామని తెలిస్తే చాలు.. మమ్మల్ని మధ్యలోనే అరెస్ట్ చేస్తున్నారని, గురుకులాల్లో టీచర్స్ తో కేసీఆర్ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఈటల మండిపడ్డారు. అన్ని విశ్వవిద్యాలయాల్లో అదే రకమైన పరిస్థితి ఉందని, గవర్నర్ దగ్గర పిల్లలు మొరపెట్టుకున్నారని, సీఎం కేసీఆర్ మనువడ్ని ఆ హాస్టల్ లోనే పేద విద్యార్థుల పక్కనే ఉంచండని ఆయన వ్యాఖ్యానించారు.