ఏసియన్ థియేటర్స్ అధినేత..నిర్మాత నారంగ్ మృతి

తెలుగు చిత్రసీమలో మరో విషాదం చోటుచేసుకుంది. ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్​కు అధినేత,
తెలుగు చలనచిత్ర పరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు నారంగ్(78) కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఏసియన్ మల్టీప్లెక్స్, ఏసియన్ థియేటర్స్​కు అధినేత నారంగ్. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌లో ‘లవ్ స్టోరీ’, ‘లక్ష్య’ సినిమాలు నిర్మించిన ఆయన ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుష్‌తో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా సినీపరిశ్రమకు సేవలందించారు నారంగ్​. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. నారాయ‌ణ దాస్ మ‌ర‌ణంపై ఎంటైర్ టాలీవుడ్ విచారాన్ని వ్య‌క్తం చేసింది. మధ్యాహ్నాం 12 గంటలకు హాస్పిటల్ నుంచి నారాయణ్‌ దాస్ నారంగ్ భౌతికకాయం ఫిల్మ్ నగర్ లోని నివాసానికి తరలిస్తారు. అక్క‌డ‌కు సినీ ప్ర‌ముఖులు చేరుకుని ఆయ‌న పార్థివ దేహానికి నివాళులు అర్పించనున్నారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, మూవీ ఫైనాన్సియ‌ర్‌గా సినీ రంగానికి సేవ‌లు అందిస్తోన్న ఆయ‌న ప్ర‌స్తుతం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్‌గానూ కొన‌సాగుతున్నారు.