వచ్చేనెల 6న భాజపాలోకి ముహూర్తం !

సన్నిహితులతో సమాలోచనలు: ‘ఈటల’ బిజీ

Etala-Into the BJP
Etala-Into the BJP!

Hyderabad: మాజీ మంత్రి ‘ఈటల’ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న తన ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలనినిర్ణయించుకున్నట్టు సమాచారం. కాగా , బీజేపీ నేతలతో ‘ఈటల’ చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. వచ్చేనెల 6 న ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ప్రధాని మోడీ,అమిత్ షా, జెపీ నడ్డాల అపాయింట్ మెంట్ తేదీ కోసం ఈటల ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. ఈటెలతో పాటు మాజీ జడ్పీ చైర్ పర్సన్ ఉమ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి భాజపా లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఈమేరకు ఆయన తన సన్నిహితులతో సమాలోచనలు చేస్తూ బిజీగా ఉన్నారని తెలిసింది.

తాజా సినిమా వార్తల కోసం:: https://www.vaartha.com/news/movies/