యనమల ఫై మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్

టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఫై ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా వైస్సార్సీపీ పార్టీ ఫై యనమల చేసిన వ్యాఖ్యల ఫై దాడిశెట్టి ఫైర్ అయ్యారు. రైలు దగ్ధం ఘటనలో కాపులతో సహా ఎస్సీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు ఇలా అందరిపై రకరకాలుగా కేసులు పెట్టి విపరీతంగా వేధించారని, తునిలో యనమల దాష్టీకానికి సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.

టీడీపీ హయాంలో ఒకే నెలలో 130 అట్రాసిటీ కేసులు తుని నియోజకవర్గంలో నమోదైతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి ఆశ్చర్యం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. ఒకే నియోజకవర్గం నుంచి ఇన్ని కేసులు ఎందుకు వస్తాయని ఆరోజున జిల్లా ఎస్పీకి నోటీసులు ఇచ్చారని గుర్తుచేశారు.