12 ఏళ్లుదాటిన పిల్లలకు వ్యాక్సిన్ : జర్మనీ నిర్ణయం

టీకాలు తప్పనిసరి కాదని స్పష్టీకరణ

Corona vaccine for children over 12 years of age
Corona vaccine for children over 12 years of age

కరోనా నియంత్రణలో జర్మనీ మరో నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలకు కూడా క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈమేరకు జూన్ 7వ తేదీ నుంచి టీకాలు ఇస్తామని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తెలిపారు. అయితే పిల్లలు క‌రోనా టీకాలు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. అయితే , నూతన విద్యాసంవత్సరానికి ముందు ఆగస్టు నాటికి పిల్లలకు కొవిడ్ టీకా మొదటి డోసు ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లలకు టీకాలు యడం ద్వారా వారిలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని చెప్పారు. జూన్ 7వ తేదీ నుంచి 12, అంత‌కు పైబ‌డిన పిల్లలు లేదా యువ‌త టీకాల కోసం నమోదు చేసుకోవచ్చని మెర్కెల్ చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/