బీజేపీ ఎంపీ రంజిత కారుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

దెబ్బతిన్న వాహనం : ఎంపీకి స్వల్ప గాయాలు

Attack on MP Ranjeeta koli's car
Attack on MP Ranjeeta koli’s car

రాజస్థాన్‌ రాష్ట్రంలో భరత్‌పూర్‌ లో బీజేపీ ఎంపీ రంజిత కోలి కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి జరిగింది. కరోనాతో బాధపడుతున్న వారిని పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ కారుపై రాళ్లు, ఇనుప రాడ్‌లతో దాడులకు దిగారు. దీంతో ఆమె వాహనం దెబ్బతింది. అయితే ఆమె సురక్షితంగా బయటపడ్డారు. రాత్రి 11.30 గంటలపుడు ధర్సోని మీదుగా భరత్‌పూర్‌ వెళ్తున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో ఎంపీకి స్వల్ప గాయాలయ్యాయి.పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎంపీ రంజిత కోలి ట్విటర్‌లో పోస్టు చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని.. పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. అ

తాజా క్రీడా వార్తల కోసం:https://www.vaartha.com/news/sports/