గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాల్గు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు , వంకలు పొంగిపొర్లతుండగా..పలు గ్రామాల్లో చెరువు మత్తడి పోస్తున్నాయి. అలాగే పలు రోడ్లు తెగిపోవడం రవాణా స్థంభించింది. ఈ తరుణంలో బిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసారు.

మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన చేశారు. భారీ వర్షాలకు అలుగు పోస్తున్న తొర్రూరు, కంటాయపాలెం, గుర్తూరు చెరువులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదని సూచించారు. ఇదిలా ఉంటె పెద్దపల్లి మండలం సబ్బీతం గ్రామంలోని గౌరీ గుండాల జలపాతం వద్ద బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా కిసాన్‌నగర్‌కు చెందిన మానుపాటి వెంకటేష్ ప్రసాద్ (23) స్నేహితులతో కలిసి గౌరిగుండాల వాటర్ ఫాల్స్ సందర్శనకు వచ్చారు. జలపాతం వద్ద రాళ్లపై ప్రమాదవశాత్తు జారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, రెస్క్యూ బృందం సభ్యులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి స్నేహితులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.

మరోపక్క రాగల రెండు రోజుల్లో తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి తోడు ఉపరితల ఆవర్తం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని , నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని నాగరత్న వివరించారు.