రజనీకాంత్ ”జైలర్” నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ రజనీకాంత్ హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్‌ డైరెక్షన్లో జైలర్ మూవీ చేస్తున్నాడు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న జైలర్‌ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు.

బుధువారం ఈ సినిమా నుండి రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ‘రా .. దాచుంచారా పరువాలన్నీ .. రాబరీకి రావే రావే, రా .. అందిస్తారా అందాలన్నీ .. ఎప్పటికీ నీవే నీవే, రావు .. నువ్వు కావాలయ్యా .. ‘ అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి సాయికిరణ్ సాహిత్యాన్ని అందించగా, సింధుజా శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటలో రజనీ మరింత స్టైల్ గా కనిపిస్తున్నారు. థియేటర్లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే ఈ పాట ఉంది. రజనీ .. తమన్నా బృందంపై ఈ పాటను ప్రత్యేకమైన సెట్ లో కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. జానీ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసారు.

ఇక ఈ మూవీ లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌, సునీల్‌, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్‌, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 10 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video