బిజెపి లో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు..

తెలంగాణ అధికారపార్టీ టిఆర్ఎస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్‌ కు పార్టీని విడి బిజెపి లో చేరారు. ఈరోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రదీప్ రావు వెంట తరుణ్ చుగ్, గరికపాటి మోహన్ రావు కూడా ఉన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగనంద్ కొల్లూరు లు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్బంగా ప్రదీప్ రావు మాట్లాడుతూ ..రాష్ట్రంలో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ బలంగా ఉందని, అధికారంలోకి వచ్చేందుకు మంచి అవకాశం ఉందన్నారు. వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటే ప్రదీప్ రావు కూడా ఆగస్టు 7న ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరారు. ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో ప్రదీప్ రావు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రదీప్ రావుతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగానంద్ కొల్లూరు కూడా బీజేపీలో చేరారు