ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు

ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఫిబ్రవరి చివరి వారం నుండే ఎండలు దచ్చికొట్టడం స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ లో 15 రోజుల క్రితమే ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీలో మాత్రం ఇంకా ఒంటి పూట బడులు ప్రారభించకపోయేసరికి విమర్శలు తలెత్తాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. హాఫ్ డే స్కూల్స్ సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి.

ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మ‌ళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయి. దాదాపు 45 రోజులు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఒక్కపూట బడికి వచ్చే విద్యార్థులకు స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తారు. ఇక పిల్లలకు ఎండ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాాలని.. అన్ని క్లాస్ రూమ్స్‌లో ఫ్యానులు తిరిగేలా.. మంచి నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

మరోపక్క ఏప్రిల్ -03 నుండి పదోతరగతి పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ సారి.. ఆరు పేపర్లే ఉండనున్నాయి. ఉదయం 9.30 దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించబోమని.. ఎవరికైనా వ్యక్తిగతంగా సరైన కారణం అన్నారు. పరీక్షా కేంద్రాల స్కూళ్ళల్లో ఇతర తరగతులు, పనులు జరగవు… బయటి వారు ఎవరూ పరీక్షా కేంద్ర ప్రాంగణంలో పరీక్ష సమయం లో అడుగు పెట్టడం నిషేధం అని
అధికారులు వెల్లడించారు.