మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది

బిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి రీసెంట్ గా రాబోయే ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ 80 సీట్లు గెలవడం ఖాయమని, ఇంకో 20-25 మంది ఎమ్మెల్యేల సీట్లు మారిస్తే..100 సీట్లు గెలవడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ తో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. గత కొద్దీ రోజులుగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తుందో లేదో అని భయపడుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ గ్యారెంటీ అని చెప్పడం తో హమ్మయ్య అనుకున్నారు. వాస్తవానికి కేసీఆర్ ఆలా చెప్పడం లో అనేక సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి తన పట్టును బిగించుకుని పనిలో ఉంది. ఇతర పార్టీ నేతలను బిజెపి లోకి చేర్చుకునేందుకు పక్క ప్లాన్ చేస్తుంది. ఈ తరుణంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ లేదంటే వారంతా బిజెపిలోకి వెళ్తారని గ్రహించిన కేసీఆర్..వారికీ టికెట్ ఖాయం అని చెప్పడం జరిగింది.

కానీ ఇప్పుడు మంత్రి ఎర్రబెల్లి చేసిన కామెంట్స్ తో వారిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. పార్టీలో అంతర్గత సమాచారం ఉండబట్టే ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం ఉంది. ఎర్రబెల్లి చెప్పినట్లు నిజంగానే 20 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వరా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే తరుణంలో ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేసారని అనవసరంగా కామెంట్స్ చేయవద్దని , మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయవద్దని సూచించినట్లు చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఎర్రబెల్లి చేసిన కామెంట్స్ మాత్రం అలజడి సృష్టిస్తున్నాయి.