APSRTC కి ఒక్క రోజే రికార్డు స్థాయి లో ఆదాయం

APSRTC కి జనవరి 18 బాగా కలిసి వచ్చింది. ఆ ఒక్క రోజే 23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది ఆర్టీసీ. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం సాధించిన రోజుగా రికార్డు సాధించింది. సంక్రాంతి పండగ APSRTC కి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. సంక్రాంతి అంటే ఏపీ..ఏపీ అంటే సంక్రాంతి అనే విధంగా సంక్రాంతి సంబరాలు ఏపీలో అంబరాన్ని తాకాయి. పెద్ద ఎత్తున ప్రజలు సొంతూళ్లకు వచ్చి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఇక సంక్రాంతి సందర్బంగా APSRTC సైతం పెద్ద ఎత్తున బస్సులను ఏర్పాటు చేసింది. రెగ్యులర్ బస్సులనే కాకుండా ప్రత్యేక బస్సులను ఏర్పటు చేయడం, ఎలాంటి అదనపు చార్జీలు వసూళ్లు చేయకపోవడం తో ప్రయాణికులు ఆర్టీసీ వైపు మొగ్గు చూపారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు వచ్చాయి. ఈ నెల 18 న రికార్డుస్థాయి లో ఆదాయాన్ని ఆర్జించంది ఏపీఎస్ ఆర్టీసీ. ఆ రోజు ఒక్కరోజే 23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

సంక్రాంతి సమయంలో కార్గో ద్వారా సరాసరిన రోజుకు అధిక ఆదాయం నమోదు చేసింది ఆర్టీసీ. కార్గో సర్వీసులోనూ ఒక్క రోజులో 55 లక్షలు ఆదాయం సాధించింది ఏపీఎస్‌ ఆర్టీసీ. కార్గోలో ఇప్పటివరకు ఒకరోజు ఆదాయం 45 లక్షలు ఉండగా దాన్ని అధిగమించి రికార్డు నెలకొల్పింది. దీంతో ఆర్టీసీ సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది కృషిని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశంసించారు. ఆదరించిన ప్రయాణికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.