మల్లారెడ్డిపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు

Malla Reddy
Malla Reddy

తెరాస పార్టీ లో మరోసారి గ్రూప్ వార్ నడుస్తుంది. మంత్రి మల్లారెడ్డి ఫై సొంత పార్టీ నేతలు గరం గరం గా ఉన్నారు. ఇప్పటికే పలుసార్లు మీడియా ముఖంగా మంత్రి ఫై నిప్పులు కురిపించగా..ఇక ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు మల్లారెడ్డి ఫై పిర్యాదు చేసారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి లు.

ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత మరోసారి మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ నేతలతో సమావేశం అవుతానని నేతలుకు చెప్పారు సీఎం కేసీఆర్. ఇక అనంతరం మేడ్చల్ జిల్లా లో నాయకుల మధ్య మంత్రి మల్లారెడ్డి గొడవలు పెడుతున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు మేడ్చల్ జెడ్పీ చైర్మన్. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని కేటీఆర్ చెప్పారని ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి.

టీఆర్ఎస్ కు, జెడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని వారం క్రితం ప్రకటించారు శరత్ చంద్రా రెడ్డి. తనకు తెలియకుండా మల్లారెడ్డి ఏకపక్షంగా పార్టీ మండల అధ్యక్షులను నియమిస్తున్నారని ఆరోపించారు. దీంతో ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ zp చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి భేటీ అయ్యారు.