ఎన్టీఆర్ మూవీ ప్రారంబోత్సవానికి ఆర్ఆర్ఆర్ టీం

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..కొరటాల శివ డైరెక్షన్లో మూవీ చేయబోతున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుకావాల్సి ఉండగా ..స్క్రిప్ట్ లో చేంజెస్ చేయమని ఎన్టీఆర్..కొరటాల ను కోరడం తో కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం కొరటాల ఫైనల్ స్క్రిప్ట్ సిద్ధం చేయడం తో సినిమాను ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఫిబ్రవరి రెండో వారంలో సినిమాను అట్టహాసంగా ప్రారభించబోతున్నారు. ఈ మూవీ ప్రారంబోత్సవానికి ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా హాజరు కానుందని సమాచారం.

దర్శక ధీరుడు రాజమౌళి, ఆయన ఫ్యామిలీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సహా RRR టీమ్ మొత్తం #NTR30 సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉందట. ఫిబ్రవరి రెండో వారంలో హైదరాబాద్‌లో ఈ ఈవెంట్‌ జరగబోతుంది. అలాగే ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆహ్వానించవచ్చని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం రావడం పక్క అంటున్నారు. మరోపక్క చరణ్..ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య లో నటించాడు. కానీ ఈ మూవీ ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.