ప్రజావాక్కు: సమస్యలపై ప్రజాగళం

Voice of the people

విద్యాసంస్థల్లో వర్చువల్‌ పోలీసు స్టేషన్లు!:- సి.హెచ్‌.సాయిరుత్విక్‌, నల్గొండ

దేశంలో పలు యూనివర్సిటీలలో అల్లర్లు, అఘాయిత్యాలు, విద్యార్థినులపై అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్న నేప థ్యంలో ఇటువంటి సున్నితమైన విద్యాసంస్థలలో వర్చువల్‌ పోలీసుస్టేషన్లను ఏర్పాటుచేయాలి.పోలీసుకమిషనరేటుకు అను సంధానమై వ్ఞండే ఈ పోలీసు స్టేషన్లుబాధితులకు ఎంతో ఉప యోగంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహంలేదు. ఎవరై నా లైంగిక, మానసిక, భౌతిక దాడులకు గురైతే ఒక ప్రత్యేక యాప్‌ ద్వారా తక్షణం ఫిర్యాదుచేస్తే తక్షణం ఆ ఫిర్యాదు కమి షనరేట్‌కు చేరుతుంది. బాధితుల వివరాలు బయటకు రాకుం డానే సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులు దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలుతీసుకోవచ్చు.

యధేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు: -ఎం.కనకదుర్గ,తెనాలి,గుంటూరుజిల్లా

తెలుగురాష్ట్రాలలో స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు నిబంధ నలకు నీళ్లొదులుతున్నారు. లింగనిర్ధారణపరీక్షలు చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ కాసులకుకక్కుర్తిపడి యధేచ్ఛగావ్యాపారం సాగి స్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకునేవారి నుంచి రూ.15 నుంచి 20వేల వరకు తీసుకుని అబార్షన్లు చేస్తున్నారు. నిఘా పెట్టా ల్సిన అధికారయంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరి స్తోంది.తెలంగాణ రాష్ట్రంలో భ్రూణహత్యలకు స్కానింగ్‌ సెంట ర్లు కేరాఫ్‌గా మారుతున్నాయి. ప్రైవేట్‌ స్కానింగ్‌ సెంటర్లపైనా వైద్యశాఖఅధికారుల నిఘాలేకపోవడంతో యధేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఈ లింగనిర్ధారణ పరీక్షల వ్యవ హారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెను ప్రమాదకర సమ స్యలుతలెత్తుతాయనిమేధావ్ఞలుప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

బిసిలపై దాడి:-బి.ఎన్‌.సత్యనారాయణ,హైదరాబాద్‌

అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రజోపకరమైన ఏదైనా ఒకప్రాజెక్టును ఆరంభించినప్పుడు దానికికావలసిన నిధు లు, సహాయసహకారాలు అందిస్తూ దానిపనులను పర్య వేక్షిస్తూ చిత్తశుద్ధితో దానిని పూర్తి చేస్తుంది. అంతటితో దానిని వదిలివేయక ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమై నప్పుడు అదనపు నిధులు సమకూరుస్తూ సేవలు అంది స్తుంది.అటువంటి ప్రభుత్వం నేడు పూర్తి వివక్షతతో దేశం లో 44శాతంగా ఉన్న బిసిలఅభివృద్ధికి రాజ్యాంగం ప్రసా దించిన రిజర్వేషన్లు,ఇతర సంక్షేమ పథకాలు అమలు పట్ల,అవరోధాల పట్ల కాని దృష్టికేంద్రీకరించడం లేదు.

పతనంవైపు ఆర్థికవృద్ధిరేటు: -సి.ప్రతాప్‌, శ్రీకాకుళం

పదకొండేళ్ల కనిష్టస్థాయికి పతనమైఎంతగానో ఆందోళనకు గురి చేస్తున్నభారత ఆర్థికవృద్ధిరేటు ఇకపై పుంజుకొనున్నదని, అందు కోసం ప్రభుత్వం సానుకూల వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోనున్నదని తాజా ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్య అంశాలపై దృష్టి సారించాలి. దేశాభివృద్ధిలో ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాతిపదికన పేద లను భాగస్వామ్యులుగా చేయాలి. జాతీయ తలసరి ఆదాయ సగటును దాదాపుగా 16రాష్ట్రాలు అందుకోలేనిపరిస్థితిని చక్కది ద్దాలి. వస్తుసేవలకు ప్రజలు చేసే ఖర్చు తగ్గిపోయి ఆ రంగాలు వెనుకబడ్డాయి. ప్రపంచంలో పేద, గొప్ప మధ్య ఆర్థిక అసమా నతలు గణనీయంగా పెరిగిపోతూ అసమానతల సూచీలో భారత్‌ 12వస్థానంలో నిలబడి సరికొత్త సామాజికసమస్యకు రూపకల్పన జరిగింది.

గుత్తేదారుల దయనీయస్థితి!:-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో చిన్న చిన్న పనులు చేసిన గుత్తేదారులకు సైతం గతపదహారు నెలలుగా చెల్లింపులు చేయ కపోవడం చాలా దుర్మార్గం. ఈ విధంగా వివిధ శాఖలలో పేరు కొన్న బకాయిలు పదివేల కోట్ల పైమాటే. ఎన్నికల కోడ్‌ అమలు నాటి నుండి నేటి వరకు చిన్న చిన్న గుత్తేదారులు ప్రభుత్వ కార్యాలయాలచుట్టూతిరుగుతున్నా ఫలితం లేకుండాపోయింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఆస్తులు అమ్మి తీవ్ర మాన సిక క్షోభకు గురవ్ఞతున్నారు. ఈ విధంగా మరికొంత కాలం కొనసాగితే రాష్ట్రంలో ప్రభుత్వ పనులు చేయడానికి ఎవరూ ముందుకురారు.అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అంటున్న అధి కారులు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదో చెప్పాలి. దాదాపు యాభైవేల కోట్ల రూపాయల అప్పు తీసుకువచ్చి పప్పుబెల్లాల్లా పంచారు. పనులు చేసినవారికి డబ్బు చెల్లించకపోతే ఇక ప్రతి ఒక్కరూ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది.

నీటిని పొదుపు చేయాలి: -కె.వీరయ్య, కంచరపాలెం, విశాఖపట్నం

ఇంటిపన్నులు,నీటి పన్నులు తగ్గించాల్సిన అవసరం ప్రభు త్వంపైఉంది. ఇవి భారీగా పెంచడం వల్ల సామాన్య మాన వ్ఞనికి కష్టం అవ్ఞతుంది. ఆర్థికభారం బాగా పడుతుంది. నీటి పన్నును తగ్గించుకోవాలంటే రోజు విడిచి రోజు నీళ్లు వదలాలి. నీటి పొదుపుపై ప్రజలను చైతన్యపరచాలి. నీటి ఆదాపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంటిలో నీటిని పొదుపుగా వాడేలా చర్యలు తీసుకోవాలి.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/