పిల్లలపై పెరుగుతున్న నేరాలు
ఇటీవల చైల్డ్ రైట్స్ అండ్ యూ ప్రచురించిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ద్వారా పిల్లలపై నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయని, భారతదేశంలో మొత్తం నేరాల పెరుగుదల ఐదుశాతంపైగానే ఉందని వెల్లడయింది. వీటిలో కిడ్నాప్, అపహరణ కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. పిల్లలపై నేరాలు 20 శాతం పెరిగాయని ఈ నివేదిక వెల్లడించింది.

మొత్తం నేరాల సంఖ్య కంటే 3.6 శాతం పెరిగిందని చైల్డ్ రైట్స్ అండ్ యూ(సి.ఆర్.వై) విశ్లేషణ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ కేసులతో మొదటి రెండు స్థానాల్లో నిలి చాయి. 19వేల కేసులతో రెండూ 14.8 శాతంగా ఉన్నాయి. జార్ఖండ్‌లో పిల్లలపై నేరాలు అత్యధికంగా 73.9 శాతం ఉం డగా, 2016 నుంచి 2017 మధ్య మణిపూర్‌లో 18.7శాతం గణనీయంగా క్షీణించింది.
పిల్లలపై జరిగే నేరాలలో కిడ్నాప్, అపహరణలు మొత్తం 1,29,032 నేరాలలో 42 శాతం నమోదయ్యాయి. పిల్లలపై జరిగే ఇతర ప్రధాన నేరాలలో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ(పోక్సో)చట్టం, అత్యాచారం, లైంగిక వేధింపులు, మైనర్ బాలికలను సేకరించడం వంటివి ఉన్నాయి.
పిల్లలపై జరిగే ఇతర నేరాల్లో హింసించడం, లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, అత్యాచారాలు, మైనర్ బాలికలను అపహరణ లాంటివి ప్రధానంగా జరుగుతున్నాయి. పిల్లలపై రోజుకు 350 రకాల నేరాలకు పాల్పడుతున్నారని ఈ నివేదిక ద్వారా వెల్లడి అయింది.
మైనర్ బాలికల అపహరణ 37శాతం పెరిగిందని బాలల హక్కుల సంఘం తెలిపింది. జార్ఖండ్ మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో కొత్తగా ప్రవేశించింది. కిడ్నాప్, అపహరణ కేసుల్లో బీహార్ కూడా మొదటి ఐదు రాష్ట్రాల జాబితాలో చేరింది. బాలకార్మికుల సంఖ్య కూడా 126 శాతం పెరిగింది. ఎన్‌సిఆర్‌బి నివేదిక 2017లో 462 బాలకార్మికుల కేసులను 2016లో 204కు వ్యతిరేకంగా జాబితా చేసింది. బాల్యవివాహాల విషయానికొస్తే ఎన్‌సిఆర్‌బి 395 కేసులను బాల్యవివాహాల నిషేధ చట్టం (పిసిఎంఎ) 2006కింద నమోదు చేసింది.
రిపోర్టింగ్‌లో 21.17 శాతం పెరుగుదల ఉన్నట్లు ఇది చూపిస్తుంది. నిర్భయ చట్టం, దిశ చట్టం లాంటివి నేడు ఎన్ని మహిళా, శిశురక్షణ చట్టాలు తీసుకువచ్చినా మృగాళ్ల ఆలోచనల్లో మార్పురావడం లేదు. కొన్నిచోట్ల మైనర్ బాలలపై లైంగిక దాడులకు పాల్పడు తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలా చోట్ల పిల్లలను కొట్టడం, వారితో దురుసుగా ప్రవర్తించడం లాంటి ఘటనలను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం.ఈ నేరాల్లో మరొక విస్తుపోయే అంశమేమి టంటే తెలిసిన వాళ్లే ఎక్కువగా ఈ నేరాలకు పాల్పడుతుండ డం, పిల్లలపైదాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వారి సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్క రిపై ఉందని, వారి హక్కులను కాపాడ టానికి అందరూ కృషి చేయాలని చైల్డ్‌రైట్స్ అండ్ యూ సంస్థ ప్రతి నిధులు తెలుపు తున్నారు.
బాలల హక్కులు, బాలల పరిరక్షణ అంశాల గురించి నేడు పిల్లలతో ప్రమేయం కలిగి ఉండే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పిల్లల రక్షణ చర్యలకు సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన కలి గించాలి. ఇల్లు తరువాత పాఠశాలలే బాలలకు సురక్షితమైనవి, పిల్లలకు సంతోషాన్ని అందించేవి. కాబట్టిపాఠశాలల్లో విద్యా సంస్థల్లో శిశుసంరక్షణా చర్యలు చేపట్టేలా ప్రభుత్వం చూడాలి. రాజ్యాంగంలోని అధికరణ 21 గౌరవంతో జీవించే హక్కును తెలుపుతుంది.
అలాగే పధ్నాలుగు సంవత్సరాల లోపు పిల్ల లందరికి విద్యాహక్కును కూడా ఈ అధికరణమే వివరిస్తుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం పిల్లలను శారీరకంగా శిక్షించడం ఉపాధ్యాయులు విద్యార్థులను కొట్టడం వంటివి వారిపై దాడి గానే పరిగణిస్తారు. ఇది పిల్లల స్వేచ్ఛ,గౌరవాలకు భంగకరం. శారీరక శిక్షలకు భయపడి పిల్లలు బడికివెళ్లడానికి నిరాకరిస్తారు లేదా శాశ్వతంగాబడికి వెళ్లడం మానేసారు.
ఈ విధంగా శారీరక శిక్షలు పిల్లల విద్యాహక్కుకు భంగం కలిగిస్తాయి. విద్యాహక్కు చట్టం (ఆర్‌టిఐ) చట్టం, 2009లోని సెక్షన్ 17,శారీరక దండ నపై సంపూర్ణ నిషేధం విధిస్తుంది. ఇది పిల్లలకి శారీరక శిక్ష, మానసిక వేధింపులను నిషేధిస్తుంది.అలాంటి వాటికి పాల్పడే వ్యక్తికి వర్తించే సేవానిబంధనల ప్రకారం దోషిగా ఉన్న వ్యక్తిపై తీసుకోవలసిన క్రమశిక్షణా చర్యలను సూచిస్తుంది.
పిల్లల సం రక్షణ, రక్షణను అప్పగించిన ఒక సంస్థ చేత నియమించబడిన లేదా నిర్వహించే ఏవ్యక్తి అయినా శారీరక లేదా మానసిక బాధలను కలిగించే రీతిలో పిల్లలపై దాడి, దుర్వినియోగం, బహిర్గతంలేదా నిర్లక్ష్యం చేయబడినప్పుడు శిక్ష ఐదుసంవత్స రాల వరకు కఠినమైన జైలుశిక్ష ఉంటుంది.
ఐదు లక్షల వరకు జరిమానా, అంతేగాక పైన పేర్కొన్న క్రూరత్వం కారణంగా పిల్లవాడు శారీరకంగా అసమర్థుడైతే లేదా మానసిక అనా రోగ్యానికి గురైతే లేదా క్రమంగా పనులు చేయడానికి మానసి కంగా అనర్హుడైతేలేదా ప్రాణానికిలేదా అవయవానికి ప్రమాదం కలిగిఉంటే, అప్పుడు జైలుశిక్ష పదేళ్లవరకు ఉండవచ్చు.
హక్కు లు, సంరక్షణ, సంస్థాపరమైన బాధ్యతలు. యునైటెడ్ నేషన్స్ కన్వెక్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ నిబంధన 19 ప్రకారం ఈ ఒప్పందంలోని భాగస్వామ్య దేశాలన్నీ పిల్లల తల్లిదండ్రు లు, చట్టబద్ధ సంరక్షకులు లేదా బాగోగులు చూసుకునే మరె వరి సంరక్షణలోనైనా ఉన్నప్పుడు లైంగిక వేధింపులు, శారీరక లేదా మానసిక హింస,గాయం లేదా వేధింపు,నిర్లక్ష్యవైఖరి, తిండి పెట్టకపోవడం లేదా దోపిడీలకు గురికాకుండా చట్టపర మైన పాలనాపరమైన, సామాజికపరమైన,విద్యాపరమైన చర్య లను తీసుకోవాలి. బాలలు 12 సంII పాటు పాఠశాలలో గడు పుతారు. కాబట్టి పాఠశాల యాజమాన్యం, పిల్లల కుటుంబా లు వారి సంరక్షణకై ప్రధాన పాత్రను నిర్వహించాలి.
- వాసిలి సురేష్
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/