తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు

బోనాల జాతర తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమన సిఎం కెసిఆర్‌

తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు
cm kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల జాతర తెలంగాణ ప్రజలకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఈసందర్భంగా అమ్మవారు ప్రజల్ని చల్లగా చూడాలని, కరోనా మహమ్మారిని రూపుమాపి చల్లని దీవెనలు అందించాలని ప్రార్ధిస్తున్నట్టు సిఎం కెసిఆర్‌ తెలిపారు. కాగా హైదరాబాద్‌ వ్యాప్తంగా పలు ఆలయాల్లో ఆదివారం ఆషాఢ బోనాలు జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి భక్తుల సందడి లేకుండానే వేడుకలు నిర్వహించారు. రేపట్నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో తెలంగాణ గ్రామాల్లో బోనాల వేడుకలను నిర్వహిస్తారు. నగర వ్యాప్తంగా నిరాడంబరంగా ఈ వేడుకలు జరిగాయి. తొలిసారిగా భక్తులు లేకుండానే ఉత్సవాలు జరిగాయి. అర్చకులు, నిర్వాహకులు అమ్మవారికి బోనాలు సమర్పించి కొవిడ్‌ను అంతమొందించాలని వేడుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/