ఏపీ గవర్నర్‌ విశ్వభూషన్ హరిచందన్‌ ప్రసంగం

YouTube video
Eighth Session of XV Legislative Assembly Day 01 on 07-03-2022 LIVE

అమరావతి: ఏపీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీపై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపింద‌ని చెప్పారు. ప్ర‌భుత్వానికి ఉద్యోగులు మూల స్తంభాల‌ని అన్నారు. అందుకే ఉద్యోగుల వ‌యోప‌రిమితిని 60 నుంచి 62 ఏళ్ల‌కు పెంచామ‌ని తెలిపారు.  విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని గ‌వ‌ర్నర్ తెలిపారు. పాలన కింది స్థాయి వరకు విస్తరించేలా గ్రామ సచివాలయాలు పని చేస్తున్నాయని కొనియాడారు.

కాగా, గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్‌ సమావేశాల సమయంలో వర్చువల్‌ విధానంలో గవర్నర్‌ మాట్లాడారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగం అనంతరం ఏపీ అసెంబ్లీ వాయిదా పడనుంది. గవర్నర్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/